చంద్రుడిపై మానవుడి తొలి అడుగుకు 57 ఏళ్లు

సరిగ్గా ఇదే రోజు..

1969 జులై 20న చరిత్ర సృష్టించిన అపోలో-11 మనిషి తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టి నేటికి (జులై 20) సరిగ్గా 57 ఏళ్లు పూర్తయ్యాయి. 1969 జులై 20న అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్ర ఉపరితలంపై కాలుమోపి, మానవాళి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టానికి తెరతీశారు. అపోలో-11 ప్రయాణం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1969లో అపోలో-11 వ్యోమనౌకలో ముగ్గురు వ్యోమగాములను చంద్రుడి వైపు పంపింది. వీరిలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఇ. ఆల్డ్రిన్ చంద్ర ఉపరితలంపై దిగగా, మైకేల్ కొలిన్స్ కమాండ్ మాడ్యూల్‌లోనే ఉండి కక్ష్యలో పరిభ్రమించారు. చంద్రుడిపై తొలిసారి కాలుమోపిన ఘనత ఆర్మ్‌స్ట్రాంగ్‌దే. ఆయన దిగిన సుమారు 20 నిమిషాల తర్వాత ఆల్డ్రిన్ కూడా చంద్ర ఉపరితలంపైకి అడుగుపెట్టారు. వీరిద్దరూ దాదాపు 21 గంటలపాటు చంద్ర మండలంపై గడిపి, పరిశోధనలు, నమూనాల సేకరణ చేపట్టారు. తొలి ప్రయత్నాలు రష్యావే చంద్రుడిపై పరిశోధనలకు తొలిసారి బీజం వేసింది సోవియట్ రష్యానే. 1959లో ‘లూనిక్-2’ వ్యోమనౌకను చంద్రుడిపైకి పంపి విజయం సాధించిన రష్యా, తర్వాత లూనిక్-3 ద్వారా చంద్రుడి ఫొటోలు తీసింది. ఈ ప్రయోగాల స్ఫూర్తితో నేరుగా వ్యోమగాములనే చంద్రుడిపైకి పంపాలన్న సాహసోపేత నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. అరకొర సాంకేతికతతోనే అద్భుతం అప్పటి అపోలో గైడెన్స్ కంప్యూటర్‌లో ఉపయోగించిన మెమరీ నేటి స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే అత్యల్పం. దీనికి కేవలం 2,048 వర్డ్స్ (సుమారు 4 కేబీ) ర్యామ్, 36 వేలకుపైగా వర్డ్స్ (సుమారు 72 కేబీ) రోమ్ మాత్రమే ఉండేవి. టెక్నాలజీ ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న ఆ కాలంలోనే, ఇంతటి పరిమిత సాంకేతిక సదుపాయాలతో నాసా మనిషిని చంద్రుడిపైకి పంపి విజయం సాధించడం అపూర్వమైన ఘనతగా చరిత్రకారులు అభివర్ణిస్తారు.
104 వీక్షణలు

ట్యాగ్‌లు

#sky #space #moonday

సంబంధిత వార్తలు

టెక్నాలజీ

భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ఊపిరి

కేంద్రమంత్రి రామ్మోహన్ను కలిసిన మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు

స్వచ్ఛాంధ్ర పనుల్లో జాప్యం వద్దన్న సీఎం చంద్రబాబు

టెక్నాలజీ

టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

తిరుమలలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పర్యటన

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

అణుశక్తి రంగ ప్రగతికి అద్దం మాస్కో మ్యూజియం

అణుశక్తి మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

విశ్వవేదికపై సింగరేణి సత్తా..

అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో ప్రథమ స్థానం.. తెలంగాణకు గర్వకారణం

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·