భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ఊపిరి

కేంద్రమంత్రి రామ్మోహన్ను కలిసిన మంత్రి తుమ్మల

న్యూఢిల్లీ,జూన్‌ 23:దశాబ్దాలుగా భద్రాద్రి జిల్లావాసులు ఎదురుచూస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే ప్రతిపాదించిన స్థలం సాంకేతిక కారణాలతో అనుకూలం కాదని తేలడంతో ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించిన ప్రభుత్వం, అక్కడ సాధ్యాసాధ్యాల పరిశీలనను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్‌ నాయుడిని కలిసి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు. కొత్తగూడెం సమీపంలో ప్రతిపాదించిన తొలి స్థలంలో ఒకవైపు విద్యుదీకృత రైల్వే మార్గం, మరోవైపు కొండలు అత్యంత సమీపంలో ఉండటం వల్ల విమానాశ్రయ నిర్మాణానికి అనుకూల పరిస్థితులు లేవని గతంలో నిర్వహించిన ఫీజిబిలిటీ అధ్యయనంలో తేలినట్లు మంత్రి తుమ్మల వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో స్థలాన్ని ఎంపిక చేసి, దానిపై సాధ్యాసాధ్యాల నివేదిక సిద్ధం చేసేందుకు ప్రత్యేక ఏవియేషన్ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. నివేదిక త్వరలో అందనున్న నేపథ్యంలో కొత్త స్థలాన్ని పరిశీలించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులను వెంటనే పంపించాలని రాంమోహన్‌ నాయుడిని కోరారు. మూడోసారి ప్రతిపాదన.. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం... గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కోసం ఇప్పటివరకు ప్రతిపాదించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురవడంతో, మూడో ప్రతిపాదిత స్థలాన్ని ప్రత్యామ్నాయంగా కేంద్రం ముందు ఉంచినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్త స్థలంపై ఫీజిబిలిటీ నివేదికను 10 రోజుల్లోనే అందించాలని కేంద్ర మంత్రి రాంమోహన్‌ నాయుడు తన అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన చర్యలను వెంటనే చేపట్టాలని కూడా స్పష్టం చేశారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు వచ్చే నెల తొలి వారంలో శంకుస్థాపన... వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయానికి వచ్చే నెల తొలి వారంలోనే శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర మంత్రి రాంమోహన్‌ నాయుడు ఈ సందర్భంగా మంత్రి తుమ్మలకు వివరించారు. భద్రాద్రి భక్తులకు వరం... దక్షిణ అయోధ్యగా ఖ్యాతి పొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోందని తుమ్మల పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు కల్పించాలంటే విమానాశ్రయం అవసరం ఎంతో ఉందన్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే భద్రాద్రి యాత్ర మరింత సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక, విద్యా రంగాలకు కొత్త ఊపు... సింగరేణి బొగ్గుగనులు, హెవీ వాటర్ ప్లాంట్‌, ఐటీసీ, బీపీఎల్‌ వంటి ప్రముఖ పరిశ్రమలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పటికే పారిశ్రామికంగా ప్రత్యేక గుర్తింపు సాధించిందని తుమ్మల తెలిపారు. సమృద్ధిగా ఉన్న అటవీ సంపద, అరుదైన ఖనిజ నిక్షేపాలు, ఎకో టూరిజం అవకాశాలతో పాటు దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటు కావడం జిల్లాకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చిందన్నారు. ఇలాంటి నేపథ్యంలో విమానాశ్రయం ఏర్పడితే పారిశ్రామిక పెట్టుబడులు పెరగడమే కాకుండా విద్యా, పర్యాటక రంగాలు గణనీయంగా పురోగమించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, మౌలిక సదుపాయాల కల్పన సహా అన్ని అంశాల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ కేంద్ర మంత్రి రాంమోహన్‌ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటే కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కల త్వరలోనే వాస్తవరూపం దాల్చుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
172 వీక్షణలు

ట్యాగ్‌లు

#ministerthummala #kinjarapurammohannaidu

సంబంధిత వార్తలు

టెక్నాలజీ

చంద్రుడిపై మానవుడి తొలి అడుగుకు 57 ఏళ్లు

సరిగ్గా ఇదే రోజు..

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు

స్వచ్ఛాంధ్ర పనుల్లో జాప్యం వద్దన్న సీఎం చంద్రబాబు

టెక్నాలజీ

టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

తిరుమలలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పర్యటన

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

అణుశక్తి రంగ ప్రగతికి అద్దం మాస్కో మ్యూజియం

అణుశక్తి మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

రచయిత Venkat Kommineni ·
టెక్నాలజీ

విశ్వవేదికపై సింగరేణి సత్తా..

అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీల్లో ప్రథమ స్థానం.. తెలంగాణకు గర్వకారణం

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·