*ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

సాంబన్న కృషి

•పర్చూరు,చీరాల రైతాంగానికి అద్భుతమైన అవకాశం... •సీఎం చంద్రబాబును ఒప్పించిన ఎమ్మెల్యే ఏలూరి •ఆయిల్‌పామ్‌,మిరప,కూరగాయలు,మామిడి సాగుతో కళకళలాడనున్న పర్చూరు నేల •ఏలూరి పరిజ్ఞానం..రైతుల అవసరాలపై •పట్టుదల..సీఎంతో చర్చల ఫలితం •మార్టూరు క్లస్టర్ లో ఆరు మండలాలు •కారంచేడు క్లస్టర్ లో రెండు మండలాలు •మదనపల్లిలో 2 న హార్టికల్చర్ ప్రారంభోత్సవం •హాజరుకానున్న ఎమ్మెల్యే ఏలూరి, రైతులు •ఉద్యాన సాగు విస్తరణకు కీలక అడుగు •హార్టికల్చర్ పట్టభద్రుడు సాంబన్న కృషి ఫలితం •సీఎం చంద్రబాబు,మంత్రి అచ్చెన్నలకు ఎమ్మెల్యే ఏలూరి కృతజ్ఞతలు పర్చూరు, సెప్టెంబరు 27: ఒకప్పుడు వర్షం కురిస్తేనే పంట, లేకుంటే కరవు రేఖలు... ఇదీ పర్చూరు నియోజకవర్గ రైతన్న నిత్య చిత్రం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దే బృహత్తర పథకం 'రాయలసీమ సమగ్ర ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక (ఐహెచ్‌డీపీ)' తొలి దశలోనే పర్చూరు, చీరాల నియోజకవర్గాలకు చోటు దక్కడం రైతాంగంలో కొత్త ఆశలు నింపింది. ఇందుకోసం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేరుగా సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి, తన నియోజకవర్గ రైతుల గోడు వినిపించి, పథకంలో పర్చూరుకు ప్రాధాన్యం దక్కేలా ఒప్పించడం విశేషం. *రూ.లక్ష కోట్ల ప్రణాళిక... రాయలసీమ ముఖచిత్రమే మారుస్తూ* రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ప్రపంచంలోనే అగ్రగామి ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఐహెచ్‌డీపీని రూపొందించింది. ప్రస్తుతం 8.41 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యాన సాగును 2030 నాటికి 14.41 లక్షల హెక్టార్లకు, 222 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తిని 435 లక్షల టన్నులకు పెంచాలన్నది లక్ష్యం. ఇందుకోసం రూ.10 వేల కోట్ల ప్రభుత్వ పెట్టుబడితో పాటు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.30 వేల కోట్ల సాయంతో మొత్తం రూ.40,352 కోట్లతో నీటిపారుదల, ఉద్యానం, గ్రామీణ రోడ్ల మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రైవేటు రంగం నుంచి మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడితో మొత్తం ప్రాజెక్టు విలువ రూ.లక్ష కోట్లకు చేరనుంది. పది జిల్లాల్లో 303 మండలాల పరిధిలోని 5,869 గ్రామాల్లో 201 క్లస్టర్లుగా దీన్ని మూడేళ్లపాటు దశలవారీగా అమలు చేయనున్నారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లోనే తొలి దశలో 72 క్లస్టర్లను చేపట్టి, తర్వాత సాగునీటి పనులకు అనుగుణంగా క్రమంగా విస్తరించే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. ఈ 72 తొలి దశ క్లస్టర్లలో పర్చూరు నియోజకవర్గం భాగమైన మార్టూరు, కారంచేడు క్లస్టర్‌ లు కూడా ఉండటం విశేషం. *సీఎంతో నిరంతర ఎమ్మెల్యే సంప్రదింపులు ...* పర్చూరు నియోజకవర్గంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలకు నీటి భద్రత, మార్కెట్‌ సదుపాయాలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మొదటి నుంచి గట్టిగా వాదిస్తూ వచ్చారు. ఐహెచ్‌డీపీ ప్రణాళిక రూపకల్పన సమయంలోనే సీఎం చంద్రబాబు నాయుడిని స్వయంగా కలిసి, పర్చూరు రైతుల సమస్యలను, ప్రాంత ఉద్యాన సామర్థ్యాన్ని వివరించి, మార్టూరు, కారంచేడు క్లస్టర్‌ను తొలి దశలోనే చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లు పర్చూరు నియోజకవర్గాన్ని మొదటి దశ జాబితాలో చేర్చేందుకు అంగీకరించారు. *పర్చూరు నియోజకవర్గ క్లస్టర్లు...ఇలా* పర్చూరు నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్ లో మొదటి దశలో చేర్చారు. నియోజకవర్గాన్ని రెండు క్లస్టర్లుగా విభజించారు. ఒకటి మార్టూరు క్లస్టర్ , రెండు కారంచేడు క్లస్టర్ లు ఉన్నాయి..దీంతో ఆటూరు పరిధిలో మార్టూరు, పర్చూరు, యద్దనపూడి, చీరాల, వేటపాలెం, చిన్నగంజాం మండలాలు, చెడు పరిధిలో కారంచేడు, ఇంకొల్లు ఉన్నాయి.....ఆయా ప్రాంతాల రైతులకు తక్షణ ప్రయోజనం చేకూరనుంది. *ఇప్పటికే వైవిధ్యభరిత ఉద్యానం... మరింత ముందడుగుకు సిద్ధం* పర్చూరు నియోజకవర్గంలో రైతులు ఇప్పటికే ఆయిల్‌పామ్‌, మిరప, కూరగాయలు, మామిడి వంటి ఉద్యాన పంటలను విస్తృతంగా సాగు చేస్తున్నారు.ఓ ఈ నేపథ్యంలో ఐహెచ్‌డీపీ తొలి దశలో చోటు దక్కడంతో, ఇప్పటికే ఉన్న ఈ పంటలకు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు, సూక్ష్మసేద్యం, ఫర్టిగేషన్‌ వ్యవస్థలు అందించి ఉత్పాదకతను పెంచేందుకు మార్గం సుగమమైంది. వాతావరణ మార్పులను తట్టుకునే హైబ్రిడ్‌ రకాల ప్రవేశపెట్టడం, పాత తోటల్లో ఉత్పాదకత మెరుగు, గుడ్‌ అగ్రికల్చరల్‌ ప్రాక్టీసెస్‌ (జీఏపీ) ధ్రువీకరణ, కోత అనంతర మౌలిక సదుపాయాలు, మార్కెట్‌ లింకేజీలు వంటివి ఈ దశలో చేపట్టనున్నారు. దీనివల్ల ఆయిల్‌పామ్‌, మిరప రైతులకు మెరుగైన ధర, మామిడి, కూరగాయల రైతులకు నాణ్యమైన నారు, నీటి భద్రత అందుబాటులోకి రానున్నాయి. *హార్టికల్చర్‌ పరిజ్ఞానం.. పర్చూరుకు వరం!* రైతుగా అనుభవం.. ఉద్యానవన శాస్త్రంలో పట్టభద్రుడు.. పంటలపై సుదీర్ఘ అధ్యయనం.. ఈ నేపథ్యం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఉద్యానవన రంగంపై ప్రత్యేక అవగాహనను అందించింది. హార్టికల్చర్‌ రంగంలో ఉన్న అవకాశాలను గుర్తించిన ఆయన.. నియోజకవర్గ రైతుల అవసరాలు, స్థానిక పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మూడో దశలో ఉన్న పర్చూరు నియోజకవర్గాన్ని తొలి దశలోనే ఎంపిక చేసేలా నిరంతరం ప్రయత్నించారు. రైతుల ప్రయోజనాల కోసం తన పరిజ్ఞానం, అనుభవాన్ని ఉపయోగించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. *హార్టికల్చర్‌ రంగంలో వివిధ అభివృద్ధి..* పంట కోత అనంతర నిర్వహణ, ప్రాసెసింగ్‌, సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ, స్టార్టప్‌ సంస్థల ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కార్యక్రమాలు, క్షేత్రస్థాయి అధ్యయన పర్యటనలతో పాటు ఇతర అభివృద్ధి చర్యలు చేపట్టనున్నారు. ఇందులో కలుపు నియంత్రణ చాపలు (వీడ్‌ మ్యాట్స్‌), సిల్పాలిన్‌ షీట్లు, టార్పాలిన్‌ షీట్లు, కవర్ల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు, ఉద్యానవన సాగుదారులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోనున్నారు. . *రైతుల్లో సంతోషమే...లక్షం.. ఎమ్మెల్యే సాంబన్న* "నా నియోజకవర్గంలోని ప్రతి రైతుకూ ఈ పథకం ప్రయోజనం చేరాలన్నదే నా లక్ష్యం. సీఎం చంద్రబాబు ముందు పర్చూరు రైతుల సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించి, మార్టూరు క్లస్టర్‌ను తొలి దశలో చేర్చేలా చేశాం. ఆయిల్‌పామ్‌, మిరప, మామిడి, కూరగాయలు సాగు చేస్తున్న మా రైతులకు సూక్ష్మసేద్య సదుపాయాలు, మెరుగైన మార్కెట్‌ లభించేలా చర్యలు తీసుకుంటాం" అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడు లకు ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. *అక్టోబరు 2న సీఎం చేతుల మీదుగా ప్రారంభం* మదనపల్లెలో అక్టోబరు 2న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఐహెచ్‌డీపీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలోని 10 క్లస్టర్ల నుంచి రైతులను ఆర్టీసీ బస్సుల్లో తరలించనుండగా, మార్టూరు, కారంచేడు ల క్లస్టర్‌ నుంచి కూడా పర్చూరు రైతులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సారథ్యంలో ఆర్టికల్చర్ అధికారి హనుమంత్ నాయక్, రైతులు హాజరు కానున్నారు. ఈ క్లస్టర్ పరిధిలో రైతు సేవ కేంద్రాల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.
109 వీక్షణలు

ట్యాగ్‌లు

#horticulturehub #nandala

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·