విత్తనాల బంతులతో పచ్చదనం పెంపొందిద్దాం:

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

మూలపాడు (ఎన్టీఆర్ జిల్లా),జూన్ 5: రాష్ట్రంలో పచ్చదనాన్ని విస్తృతంగా పెంపొందించేందుకు విత్తనాల బంతుల (సీడ్ బాల్స్) తయారీ, పంపిణీ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్‌ఫ్లై పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా తన తల్లి అంజనా దేవి పేరుతో కొండపల్లి బొమ్మల తయారీలో వినియోగించే తెల్ల పొణికి మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన "మా కే నామ్ ఏక్ పేడ్" పిలుపు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గత 20 రోజులుగా విత్తనాల బంతుల తయారీపై అటవీశాఖ అధికారులు, వన సంరక్షణ సమితి (వీఎస్‌ఎస్) సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నంను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజలు పెద్దఎత్తున విత్తనాల బంతులు తయారు చేసి వినియోగించాలని పిలుపునిచ్చారు. వివిధ రకాల అటవీ, పర్యావరణానికి ఉపయోగపడే వృక్షాల విత్తనాలపై అధికారులతో, నిపుణులతో చర్చించిన పవన్ కళ్యాణ్ స్వయంగా విత్తనాల బంతులు తయారు చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వెయ్యి అంకుడు మొక్కలను నాటించారు. అలాగే డ్రోన్ల ద్వారా విత్తనాలు, విత్తనాల బంతులను అటవీ ప్రాంతాల్లో చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విధానం ద్వారా విస్తృత స్థాయిలో పచ్చదనం పెంపొందించవచ్చని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) పీవీ చలపతిరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మల్లిఖార్జునరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశతో పాటు అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
174 వీక్షణలు

ట్యాగ్‌లు

#environnement #ntrkrishnadistrict #deputycm

సంబంధిత వార్తలు

ఆరోగ్యం

పర్యావరణ హితం.. కలెక్టర్ వినూత్న ప్రయత్నం

ఎలక్ట్రిక్ స్కూటీకి జిల్లా కలెక్టర్ పూజలు

రచయిత Sriram ·
ఆరోగ్యం

సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్‌ కీలకం

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణకు

సీఎం చంద్రబాబు పిలుపు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం

'ఈగల్' పోరాటం

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

నాణ్యమైన వైద్య సేవలు తప్పనిసరి: మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

కనిగిరిలో నూతన అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించిన మంత్రులు

ఆనం,గొట్టిపాటి, ఉగ్ర

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·