సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్‌ కీలకం

సీఎం చంద్రబాబు

కుప్పం:సంజీవని కార్యక్రమంలో డేటా అనుసంధానమే అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండో రోజు కుప్పం ప్రాంతీయ ఆస్పత్రిలో సీటీ స్కాన్‌, డయాలసిస్‌ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌ నుంచి ఆస్పత్రి పరిశుభ్రత వరకు ప్రతి అంశంపైనా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిజిటలైజేషన్‌తోపాటు డేటా అనుసంధానం అవసరం సీటీ స్కాన్‌ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా రోజుకు ఎంతమందికి సేవలు అందించగలరని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. రోజుకు 30-40 మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఆస్పత్రి ఆవరణలో కొంతమేర చెత్త కనిపించడాన్ని గమనించిన సీఎం, వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంజీవని కార్యక్రమం ద్వారా ప్రజలు సంతృప్తి చెందాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన, హెల్త్‌ రికార్డులను డిజిటలైజ్‌ చేయడంతోపాటు ప్రతి అంశంలోనూ డేటా ఇంటిగ్రేషన్‌ చేపట్టాలని సూచించారు. డయాలసిస్‌ వార్డు సందర్శన సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు డయాలసిస్‌ కోసం కుప్పం ఆస్పత్రికి వస్తున్నారని అధికారులు వెల్లడించగా, కుప్పంలో ప్రజలకు సంజీవని ద్వారా ఏమేరకు మేలు కలిగిందో వివరాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. గంజాయి నియంత్రణపై కఠిన వైఖరి పంచతత్వ కాన్సెప్టుతో ఏర్పాటు చేసిన వాకింగ్‌ ట్రాక్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి అక్కడ మొక్క నాటారు. వైద్యారోగ్య రంగంలోని వివిధ ఆవిష్కరణలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించి, రోడ్డు ప్రమాదాల సమయంలో వైద్యులకు తక్షణ సమాచారం అందించే పరికరాన్ని రూపొందించిన విద్యార్థినిని అభినందించారు. గంజాయి, డ్రగ్స్‌ బారినపడ్డ వారికి మెడిటేషన్‌ ద్వారా ఆరోగ్యం మెరుగయ్యేలా సహకారం అందిస్తున్నట్టు బ్రహ్మకుమారీలు వివరించగా, డ్రగ్స్‌, గంజాయి నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం కుప్పం నగరంలో ఏర్పాటు చేసిన స్వర్ణ కుప్పం-స్వచ్ఛ కుప్పం స్వాగత ఆర్చ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
145 వీక్షణలు

ట్యాగ్‌లు

#cm #cbn

సంబంధిత వార్తలు

ఆరోగ్యం

పర్యావరణ హితం.. కలెక్టర్ వినూత్న ప్రయత్నం

ఎలక్ట్రిక్ స్కూటీకి జిల్లా కలెక్టర్ పూజలు

రచయిత Sriram ·
ఆరోగ్యం

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణకు

సీఎం చంద్రబాబు పిలుపు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం

'ఈగల్' పోరాటం

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

నాణ్యమైన వైద్య సేవలు తప్పనిసరి: మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

కనిగిరిలో నూతన అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించిన మంత్రులు

ఆనం,గొట్టిపాటి, ఉగ్ర

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·