తెలంగాణలో జనసేన రాజకీయ పోరాటం: పవన్ కళ్యాణ్

తెలంగాణలో జనసేనపార్టీ రాజకీయంగా బలంగా అడుగుపెడుతుందని, రానున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణులు చూస్తుంటే రాష్ట్రంలో జనసేన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సమావేశం’కు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ జనసేన నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం స్థానిక నాయకులు చాలా కాలంగా కోరుతున్నారని, ఇప్పుడు ప్రజల అవసరాల దృష్ట్యా జనసేన ప్రత్యక్ష రాజకీయ పోరాటం ప్రారంభిస్తోందని చెప్పారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బలంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. పొత్తులతో వెళ్లాలా, ఒంటరిగా పోటీ చేయాలా అనేది కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. *తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాను గానీ, జనసేన పార్టీ గానీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర విభజనను గౌరవప్రదంగా నిర్వహించకుండా పార్లమెంటులో జరిగిన తీరుపై మాత్రమే తమకు అభ్యంతరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన వారికి తగిన గౌరవం దక్కలేదన్న ఆవేదనతోనే అప్పట్లో నిరసన తెలిపానని చెప్పారు. ప్రాంతీయ విద్వేషాలు దేశ సమగ్రతకు ముప్పు రాష్ట్ర విభజన జరిగి దశాబ్దానికి పైగా గడిచినా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపకుండా కొందరు రాజకీయ నాయకులు ఇప్పటికీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నాయకుల తప్పులను ప్రశ్నించాలే గానీ, ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ప్రాంతీయ విద్వేషాలు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని, అవి ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ నా గుండెల్లో ఉంటుంది తెలంగాణపై తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, జనసేన పార్టీ కూడా ఈ గడ్డపైనే పుట్టిందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఆదిలాబాద్‌ తండాల నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై పనిచేశానని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి తనకు ముఖ్యమని పేర్కొన్నారు. అమిత్ షాపై వ్యాఖ్యలకు స్పందన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు స్పందించినందుకే తనపై విమర్శలు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. అమిత్ షా అనని విషయాలను చెప్పారని తాము ఖండించామని, దానిని ప్రాంతీయ వివాదంగా మార్చడం సరికాదన్నారు. చెరువు కబ్జా ఆరోపణలపై సవాల్ తనపై వస్తున్న చెరువు కబ్జా ఆరోపణలను ఖండించిన పవన్ కళ్యాణ్, ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని కోరారు. ఎక్కడైనా తప్పు జరిగినట్లు తేలితే సంబంధిత భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగిస్తానని ప్రకటించారు. తనకు అక్కడ గోశాల మాత్రమే ఉందని వివరించారు. గద్దర్‌కు ఏపీలోనూ గౌరవం ప్రజా గాయకుడు గద్దర్‌తో తనకు ఎంతో సన్నిహిత సంబంధం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గద్దర్ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగిస్తామని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టాలి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య స్నేహభావం, ఐక్యత మరింత బలపడాలని కోరుకున్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్న శక్తులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ కోరారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించకూడదన్నారు. చివరగా, తెలంగాణలో జనసేన ప్రజా సమస్యలపై రాజీ లేకుండా పోరాడుతుందని, ప్రజల మద్దతుతో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
163 వీక్షణలు

సంబంధిత వార్తలు

సినిమాలు

రంగస్థలం నుంచి వెండితెర వరకు విశిష్ట సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి

భరణి

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

గాన కోకిల" మూగబోయింది

జానకమ్మ అస్తమయం

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

సంగీత సరస్వతి బాలమురళి నేడు జయంతి

ఘనంగా నివాళులు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

వెండితెర సుందరి నుంచి వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌గా"సదా"అరుదైన ప్రస్థానం

పులుల ప్రేమలో పడి కెమెరా పట్టిన 'జయం' కథానాయిక

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

ముక్కావారిపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి

రామ్‌జీ జాబ్‌కార్డుల పంపిణీ

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత

విలక్షణ నటుడు

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·