సంగీత సరస్వతి బాలమురళి నేడు జయంతి

ఘనంగా నివాళులు

విజయవాడ:కర్ణాటక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా సంగీత ప్రియులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. 1930 జూలై 6న తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తంలో సూర్యకాంతమ్మ, పట్టాభిరామయ్య దంపతులకు జన్మించిన బాలమురళి, బాల్యంలోనే తల్లిని కోల్పోయినప్పటికీ ఏడో ఏట నుంచే కచేరీలు ప్రారంభించి సంగీత రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచారు. బాల్యం నుంచే సంగీత సాధన తొమ్మిదేళ్ల వయసుకే వయోలిన్, మృదంగం, కంజీర వాయిద్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన బాలమురళి, కుమారుడి ప్రతిభను గుర్తించిన తండ్రి పట్టాభిరామయ్య ఆయనను గాయక బ్రహ్మ పారుపల్లి రామకృష్ణయ్య వద్ద శిష్యరికానికి పంపారు. ఆ తర్వాత కొంతకాలం విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అనంతరం మద్రాసులో స్థిరపడి తమిళ, కన్నడ, మలయాళ భాషలపైనా పట్టు సాధించారు. 30 వేలకుపైగా కచేరీలు తన సుదీర్ఘ సంగీత జీవితంలో 30 వేలకుపైగా కచేరీలు నిర్వహించిన బాలమురళి, అన్నమయ్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, ఎంకిపాటలు, తత్వాలు, లలిత గీతాలు, భక్తి గీతాలను అలవోకగా ఆలపించారు. 72 మేళకర్తల్లో కీర్తనలు రచించిన వాగ్గేయకారుడిగా, లవంగి, త్రిశక్తి, మహతి వంటి కొత్త రాగాలను సృష్టించిన సృజనశీలిగా ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. సినీ రంగంలోనూ ప్రతిభ భక్త ప్రహ్లాద చిత్రంలో నారదుడి పాత్రలో మెప్పించిన బాలమురళి, కన్నడ చిత్రం హంసగీతేకు సంగీత దర్శకత్వం వహించడంతోపాటు ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నారు. మధ్వాచార్య చిత్రానికిగాను జాతీయ స్థాయి పురస్కారం దక్కించుకున్నారు. బిరుదులు, అవార్డులు గానసుధాకర, సంగీత సామ్రాట్, సంగీత కళాసరస్వతి, కళాప్రపూర్ణ, గానగంధర్వ వంటి వందలాది బిరుదులు అందుకున్న బాలమురళి, ఫ్రెంచి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక షేవలియర్ అవార్డు పొందిన ఏకైక కర్ణాటక సంగీత విద్వాంసుడిగా చరిత్రకెక్కారు. ఆయన జయంతి సందర్భంగా సంగీత లోకం నివాళులర్పిస్తోంది.
110 వీక్షణలు

ట్యాగ్‌లు

#balamuralikrishna #padmashree #mangalampalli

సంబంధిత వార్తలు

సినిమాలు

రంగస్థలం నుంచి వెండితెర వరకు విశిష్ట సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి

భరణి

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

గాన కోకిల" మూగబోయింది

జానకమ్మ అస్తమయం

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

వెండితెర సుందరి నుంచి వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌గా"సదా"అరుదైన ప్రస్థానం

పులుల ప్రేమలో పడి కెమెరా పట్టిన 'జయం' కథానాయిక

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

ముక్కావారిపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి

రామ్‌జీ జాబ్‌కార్డుల పంపిణీ

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత

విలక్షణ నటుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

అమరావతిలో బాలకృష్ణ 112వ చిత్రం ప్రారంభం

క్లాప్ కొట్టిన మంత్రి లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·