భద్రాద్రి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులో కీలక అడుగులు

సీతంపేట, సుజాతనగర్‌లే అనుకూలం

ఖమ్మం,: భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసుల దశాబ్దాల కల అయిన గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం సాకారానికి చేరువైంది. గతంలో ప్రతిపాదించిన రెండు స్థలాలు సాంకేతిక, ఆర్థిక కారణాలతో అనుకూలం కాదని తేలడంతో, జిల్లా యంత్రాంగం స్వతంత్ర సంస్థ 'రాజ్‌ టెక్నాలజీస్‌'తో చేయించిన సాధ్యాసాధ్యాల నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్‌ నాయుడుకు జులై 4న అందజేశారు. ఏటీఆర్‌-72-600 తరహా విమానాలకు అనుగుణంగా జిల్లాలోని ఆరు ప్రాంతాలను పరిశీలించగా, సీతంపేట, సుజాతనగర్‌ ప్రాంతాలు అనుకూలమైన భూతలం, భూవినియోగంతో సాంకేతిక ప్రమాణాలకు తగినట్టు తేలింది. సుమారు 667 ఎకరాల్లో ఎలాంటి ప్రధాన అవరోధాలు లేకుండా అభివృద్ధి చేపట్టవచ్చని నివేదిక పేర్కొంది. గిరిజన, పారిశ్రామిక, పర్యాటక ప్రాధాన్యత కలిగిన ఈ జిల్లాలో సింగరేణి గనులు, హెవీ వాటర్‌ ప్లాంట్‌ వంటి పరిశ్రమలతోపాటు భద్రాచలం క్షేత్రానికి లక్షలాది భక్తులు వస్తుంటారని, విమానాశ్రయం వల్ల పెట్టుబడులు, పర్యాటకం, అభివృద్ధికి ఊతం లభిస్తుందని మంత్రి తుమ్మల తన లేఖలో పేర్కొన్నారు. ఫీజిబిలిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
229 వీక్షణలు

ట్యాగ్‌లు

#minister #tummala

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

సాంబన్న కృషి

రచయిత Sriram ·
రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·