నారా బ్రాహ్మణికి అరుదైన జాతీయ గుర్తింపు

మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్

ఫార్చ్యూన్ ఇండియా 100 మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ జాబితాలో స్థానం కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం అమరావతి, జూలై 11: హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా తాజాగా ప్రకటించిన '100 మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్-2026' జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక రంగానికి విశేష సేవలందిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తిస్తూ ఫార్చ్యూన్ ఇండియా ఏటా ఈ జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం విశేషం. ఢిల్లీలో అవార్డు ప్రదానం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించిన ఫార్చ్యూన్ ఇండియా సదస్సులో నారా బ్రాహ్మణి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ చేతుల మీదుగా బ్రాహ్మణికి ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హెరిటేజ్ ఫుడ్స్ సాధించిన ఈ విజయ ప్రయాణంలో రైతుల పాత్రే అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. డెయిరీ రంగం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, రైతుల సంక్షేమం కోసం సంస్థ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను ఆమె వేదికపై ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ గుర్తింపు తనతో నడుస్తున్న బృందం, మార్గదర్శకులు, భాగస్వాముల కృషికి ప్రతిబింబమని బ్రాహ్మణి పేర్కొన్నారు. కుటుంబం, పరిశ్రమ వర్గాల హర్షం కోడలు సాధించిన ఈ ఘనతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. ఈ గుర్తింపు బ్రాహ్మణి నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, అంకితభావానికి నిదర్శనమని, ముఖ్యంగా తెలుగు యువతులకు ఇది గొప్ప స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ కూడా తన సతీమణి సాధించిన విజయంపై గర్వం వ్యక్తం చేస్తూ, ఆమె సమర్థ నాయకత్వంలో సంస్థ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నారా భువనేశ్వరి సైతం ఈ సందర్భంగా స్పందించారు. బ్రాహ్మణి తండ్రి, ప్రముఖ నటుడు బాలకృష్ణ కూడా కుమార్తె సాధించిన ఈ ఘనతపై అభినందనలు తెలిపారు. బ్రాహ్మణి సాధించిన ఈ అరుదైన గౌరవంపై నారా కుటుంబ సభ్యులతో పాటు హెరిటేజ్ సంస్థ ప్రతినిధులు కూడా హర్షం వ్యక్తం చేశారు. వ్యాపారం, పరిశ్రమలు, సమర్థవంతమైన నాయకత్వం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేషమైన కృషి చేస్తూ సమాజంపై తమదైన ముద్ర వేసిన మహిళామణులకు ఈ జాబితాలో చోటు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి ఎంపిక తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
138 వీక్షణలు

సంబంధిత వార్తలు

వ్యాపారం

నాబార్డ్‌ మాజీ ఛైర్మన్‌ పామిడి కోటయ్య కన్నుమూత

బ్యాంకింగ్‌ రంగంలో అత్యున్నత శిఖరాలకు

వ్యాపారం

పొగాకు ధర కిలో రూ.200కు తగ్గొద్దు:

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
వ్యాపారం

పొగాకు కొనుగోళ్లకు ఊపు

మంత్రి అచ్చెన్నాయుడు

రచయిత Venkat Kommineni ·
వ్యాపారం

కోహెడ అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

CM revanth

వ్యాపారం

ఏపీపై రుసాల్ దృష్టి.. భారీ అల్యూమినియం పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
వ్యాపారం

భారత్‌లో అత్యాధునిక స్టీల్ ప్లాంట్‌కు రండి

నోవోస్టల్–ఎం చైర్మన్‌కు మంత్రి లోకేష్ ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·