అమరావతిలో బాలకృష్ణ 112వ చిత్రం ప్రారంభం

క్లాప్ కొట్టిన మంత్రి లోకేష్

అమరావతి: ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా ఒక భారీ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ చిత్రం పూజా కార్యక్రమం, ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి, పూజలో పాల్గొన్న అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఇంతకుముందెన్నడూ ఏ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లలేదని, ఈ అరుదైన అవకాశం ఇచ్చిన బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. బాలకృష్ణ నాయకత్వంలో ప్రజా రాజధాని అమరావతిలో సినీ పరిశ్రమను పెద్దఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా విస్తృతంగా ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని, దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అమరావతిలో ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఇది పవిత్ర భూమి అని, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
146 వీక్షణలు

ట్యాగ్‌లు

#nandamuri #balakrishna #amravati #new #movie

సంబంధిత వార్తలు

సినిమాలు

రంగస్థలం నుంచి వెండితెర వరకు విశిష్ట సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి

భరణి

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

గాన కోకిల" మూగబోయింది

జానకమ్మ అస్తమయం

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

సంగీత సరస్వతి బాలమురళి నేడు జయంతి

ఘనంగా నివాళులు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

వెండితెర సుందరి నుంచి వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌గా"సదా"అరుదైన ప్రస్థానం

పులుల ప్రేమలో పడి కెమెరా పట్టిన 'జయం' కథానాయిక

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

ముక్కావారిపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి

రామ్‌జీ జాబ్‌కార్డుల పంపిణీ

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత

విలక్షణ నటుడు

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·