డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం

'ఈగల్' పోరాటం

విజయవాడ:రాష్ట్రంలో 13 నుంచి 18 ఏళ్ల యువత గంజాయి, మాదకద్రవ్యాల ఉచ్చులో చిక్కుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా 3.5–4 కోట్ల మంది ఈ వ్యసనానికి బానిసలైనట్లు అంచనా. వీరిలో 60–70 శాతం మంది కేవలం స్నేహితుల ఒత్తిడితోనే ఈ మార్గం పట్టినట్లు తేలింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' కింద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. "స్నేహితుల ముసుగులో శత్రువులు" ముఖ్య అతిథిగా పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, యువశక్తే దేశానికి అతిపెద్ద పెట్టుబడి అని, చిన్న అవగాహన లోపం వల్ల పిల్లలు డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యసనం అలవాటు చేసే స్నేహితులు శత్రువులతో సమానమని, ఒక్కసారి బానిసైతే జైలు తప్పదని హెచ్చరించారు. 'జీరో కల్టివేషన్' దిశగా ఈగల్ టాస్క్‌ఫోర్స్ 450 మంది సిబ్బందితో ఏర్పాటైన 'ఈగల్' టాస్క్‌ఫోర్స్ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి 'జీరో కల్టివేషన్' సాధించినట్లు మంత్రి అనిత తెలిపారు. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం రవాణా, నిల్వ, వాడకానికి కనీసం ఆరు నెలల జైలు తప్పదని హెచ్చరించారు. డ్రగ్స్ సమాచారం కోసం 1972 నెంబర్‌కు ఫోన్ చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. తగ్గుతున్న వ్యసన వయసు మహిళాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎ. సూర్యకుమారి మాట్లాడుతూ, గతంలో 25 ఏళ్ల వయసులో వ్యసనానికి బానిసలయ్యేవారు ఇప్పుడు 18–20 ఏళ్లకే చిక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వాలంటే 112కు కాల్ చేయవచ్చని, విద్యార్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ ప్రతిజ్ఞలో పాల్గొనాలని కోరారు. 'ఆపరేషన్ గరుడ', 'వజ్రాయుధం'తో మాఫియాపై ఉక్కుపాదం 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ, ఏఎస్ఆర్ జిల్లాలో 28 వేల హెక్టార్లలో గంజాయి సాగును నియంత్రించామని, 'ఆపరేషన్ గరుడ', 'ఈగల్', 'వజ్రాయుధం' పేరిట 1.93 లక్షల తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈగల్ వింగ్ ఎస్పీ కె. నగేష్ కుమార్ మాట్లాడుతూ, విద్యాసంస్థల్లో 40 వేలకుపైగా 'ఈగల్ క్లబ్స్' పనిచేస్తున్నాయని, పెడ్లింగ్ చేసేవారు రాష్ట్రం విడిచి వెళ్లాలని హెచ్చరించారు. NAPDD రాష్ట్ర సమన్వయ అధికారి ఉమారాణి మాట్లాడుతూ, యువతలో మాదకద్రవ్య వ్యసనం సరిహద్దు ఉగ్రవాదం కంటే పెద్ద ముప్పుగా మారిందని, ఇది సామాజిక సమస్యగా అందరూ స్పందించాలని కోరారు. ముగింపులో ప్రతిజ్ఞ కార్యక్రమం చివర్లో దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి అనిత "సే నో టు డ్రగ్స్" అని, కలెక్టర్ డా. జి. లక్ష్మీశా "డ్రగ్స్ వద్దు బ్రో" అని సంతకాలు చేస్తూ సిగ్నేచర్ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు.
157 వీక్షణలు

ట్యాగ్‌లు

#home #minister #anitha #eagle #team #operation #garuda #vajrayudham

సంబంధిత వార్తలు

ఆరోగ్యం

పర్యావరణ హితం.. కలెక్టర్ వినూత్న ప్రయత్నం

ఎలక్ట్రిక్ స్కూటీకి జిల్లా కలెక్టర్ పూజలు

రచయిత Sriram ·
ఆరోగ్యం

సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్‌ కీలకం

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణకు

సీఎం చంద్రబాబు పిలుపు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

నాణ్యమైన వైద్య సేవలు తప్పనిసరి: మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

కనిగిరిలో నూతన అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించిన మంత్రులు

ఆనం,గొట్టిపాటి, ఉగ్ర

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·