ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులకు ఆహ్వానం
ప్రిన్సిపాల్ కవిత
హైదరాబాద్(బీహెచ్‌ఈఎల్):
బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్‌లోని శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ.కవిత తెలిపారు.
విద్యార్హతలు ఇవీ...
అభ్యర్థులు పీజీలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుందని ఆమె వివరించారు. నెట్, సెట్, పీహెచ్‌డీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఖాళీలు ఈ సబ్జెక్టుల్లో...
కళాశాలలో ఆంగ్లం-1, తెలుగు-1, హిందీ-1, చరిత్ర-1,రాజనీతి శాస్త్రం-1, కామర్స్-2, గణితం-1,కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపాల్ కవిత తెలిపారు.
జూలై 25 లోగా దరఖాస్తు చేసుకోవాలి
ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలతో పాటు దరఖాస్తులను ఈ నెల (జూలై) 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కళాశాలలో సమర్పించాలని ఆమె కోరారు.