ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

నాణ్యమైన వైద్య సేవలు తప్పనిసరి: మంత్రి తుమ్మల

ఖమ్మం, జూన్ 25: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. గురువారం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించి, వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, సదుపాయాలు, పరిశుభ్రత, ఔషధాల లభ్యత, సిబ్బంది పనితీరుపై వైద్యాధికారులను మంత్రి ప్రశ్నించారు. చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో నేరుగా మాట్లాడి, అందుతున్న సేవల తీరును తెలుసుకున్నారు. రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, వచ్చే ప్రతి రోగికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ భవనం పనులను వేగవంతం చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించాలని, అంతర్గత రహదారులను గుంతలు లేకుండా మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి రోగి సంతృప్తి చెందేలా సేవలు అందించాలని మంత్రి పేర్కొన్నారు. అనంతరం ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలోని విడివోస్ కాలనీలో జరుగుతున్న ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను మంత్రి పరిశీలించారు. ఇంటింటి సర్వే, నమోదు ప్రక్రియ పురోగతిని అడిగి తెలుసుకుని, పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాల్ల దుర్గాప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేందర్, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
147 వీక్షణలు

ట్యాగ్‌లు

#minister #tummala #govthospitalvisit

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·