కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైనం

హైదరాబాద్, జూలై 24: మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని అధినేత కేసీఆర్ దంపతులు తమ తనయుడిని ఆశీర్వదించారు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ కలియతిరిగారు. తండ్రి కేసీఆర్‌తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన సందర్భంగా మొక్క నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోరిక మేరకు మొక్క నాటి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షితో పాటు కుటుంబసభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఉద్యమిస్తున్న యువతకు మద్దతుగా, వారిపై జరుగుతున్న నిర్బంధాన్ని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నీట్ లీకేజీ బాధిత విద్యార్థులకు మద్దతుగా ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ అక్కడి నుంచి నేరుగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు.
200 వీక్షణలు

ట్యాగ్‌లు

#kcr #ktr #brs #ktrbirthday

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

సాంబన్న కృషి

రచయిత Sriram ·
రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·