సాగర్ ఆయకట్టు రైతన్నకు సీతారామ"భరోసా"

రాజీవ్ లింక్‌ కెనాల్‌ ద్వారా గోదావరి జలాలు

ఖమ్మం:గోదావరి పరీవాహక ప్రాంతంలో, ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటా ఇలా వృథాగా సముద్రం పాలయ్యే గోదావరి జలాలను ఈసారి సద్వినియోగం చేసుకుని, ఆయకట్టు రైతులకు సాగునీటి భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేసింది. సీతారామ ఎత్తిపోతల పథకం మోటార్లను తక్షణమే ఆన్‌ చేసి, రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా గోదావరి నీటిని వైరా రిజర్వాయర్‌కు తరలించాలని నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన అధికారులు నేటి ఉదయం బిజ్జి కొత్తూరు వద్ద మోటార్లను ఆన్‌ చేసి, గోదావరి జలాల తరలింపు ప్రక్రియను షురూ చేశారు. *వెనక్కు మళ్లిన నీళ్లు.. 13 కి.మీ. పయనం* సాధారణంగా సాగర్‌ మెయిన్‌ బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా ఆయకట్టుకు ముందుకు సాగాల్సిన గోదావరి జలాలను, ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఓ వినూత్న పద్ధతిలో వెనక్కు మళ్లించే ఏర్పాట్లు చేశారు. సీతారామ మోటార్ల ద్వారా కాలువలోకి చేరిన నీటిని ఏకంగా 13 కిలోమీటర్ల దూరం వెనుకవైపు నడిపించి, అక్కడి నుంచి ఎస్కేప్‌ లాకుల ద్వారా వైరా రిజర్వాయర్‌లోకి మళ్లించనున్నట్లు మంత్రి తుమ్మల వివరించారు. ఈ సాంకేతిక ప్రక్రియ ద్వారా తరలుతున్న గోదావరి జలాలు రేపు మధ్యాహ్నానికల్లా వైరా రిజర్వాయర్‌ను చేరనున్నాయని, దీంతో రిజర్వాయర్‌ నీటి నిల్వ గణనీయంగా మెరుగుపడుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. *వృథా కాకుండా వరద జలాల సద్వినియోగం..* ఏటా వర్షాకాలంలో గోదావరిలో వచ్చే వరద జలాల్లో గణనీయ భాగం ఎలాంటి వినియోగం లేకుండా సముద్రంలో కలిసిపోతుండటం ఆనవాయితీ. ఈ ధోరణికి భిన్నంగా, సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి సామర్థ్యంతో వినియోగించుకుని, లభ్యమయ్యే ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ కృషిలో భాగంగానే వరద ఉధృతి పెరిగిన వెంటనే మోటార్లను ఆన్‌ చేసి, ఆ జలాలను అవసరమైన రిజర్వాయర్లకు తరలించే కార్యాచరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. *సాగర్‌, వైరా ఆయకట్టుకు దీర్ఘకాలిక ప్రయోజనం..* సీతారామ ప్రాజెక్టు ద్వారా జరుగుతున్న ఈ నీటి తరలింపు కేవలం తాత్కాలిక చర్య మాత్రమే కాదని, సాగర్‌ ఆయకట్టుతో పాటు వైరా పరిధిలోని రైతాంగానికి దీర్ఘకాలికంగా సాగునీటి భద్రత చేకూర్చే ప్రయత్నంగా అధికారులు అభివర్ణిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా ఆయకట్టుకు నీటి ఎద్దడి రాకుండా ఇలాంటి ముందస్తు నిల్వ చర్యలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటున్నారు. వైరా రిజర్వాయర్‌ నీటి మట్టం పెరగడం వల్ల ఆ పరిధిలోని పలు గ్రామాల్లో తాగు, సాగునీటి అవసరాలకు ఢోకా ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. *మంత్రి తుమ్మల పర్యవేక్షణ..* గోదావరిలో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన సందర్భాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకుంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఈ తరలింపు ప్రక్రియను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, ప్రతి అవకాశాన్నీ ఆయకట్టు ప్రయోజనం కోసం వినియోగించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
199 వీక్షణలు

ట్యాగ్‌లు

#minister #tummala

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

సాంబన్న కృషి

రచయిత Sriram ·
రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·