ప్రజల మదిలో సాంబన్నగా..హ్యాట్రిక్ నేతగా ఏలూరి

సేవ,అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం

విజయవాడ: పర్చూరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నేత ఏలూరి సాంబశివరావు. రాజకీయాల కంటే ప్రజాసేవే తనకు ఇష్టమని పదేపదే చెప్పే ఆయన, వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ విజేతగా నిలిచారు. తెలుగుదేశం పార్టీ తరపున 2014లో తొలిసారి బరిలోకి దిగిన ఆయన, సమీప ప్రత్యర్థిపై పది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. 2019లో స్వల్ప మెజారిటీతోనైనా మళ్లీ విజయం సాధించి, తన పట్టుదలను నిరూపించుకున్నారు. ఆపై 2024 ఎన్నికల్లో ఏకంగా 24 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించి, పర్చూరు ప్రజల విశ్వాసాన్ని మరోసారి చాటుకున్నారు. రైతన్నలకు అండగా.. నియోజకవర్గంలోని రైతుల సమస్యలపై ఎమ్మెల్యే ఏలూరి ఎప్పటికప్పుడు గళమెత్తుతూ వస్తున్నారు. బాపట్ల జిల్లా మర్టూరు మండలం నాగరాజుపల్లి గ్రామంలో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని రైతుల భూమి హక్కుల సమస్యను ఆయన ప్రత్యేక చొరవతో పరిష్కరించి, రైతులకు ఊరట కలిగించారు. మెట్ట ప్రాంత రైతులు పండించే పొగాకు పంటకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్‌ సదుపాయాలపైనా ఆయన నిరంతరం ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్తూ, రైతన్నలకు అండగా నిలుస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికపై నమోదవుతున్న ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తూ, ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతను ఆయన నిలకడగా నిర్వర్తిస్తున్నారు. పేదలకు ఉచిత కంటి వెలుగులు గత పదిహేనేళ్లుగా రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే ఏలూరి సాగిస్తున్న సేవా కార్యక్రమాలు నియోజకవర్గ ప్రజలకు సుపరిచితం. తన సోదరుడు ఏలూరి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఏలూరి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో, నోవా అగ్రి గ్రూప్‌, ఆస్టర్‌ రమేష్‌ ఆసుపత్రి, గుంటూరు శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉచిత మెగా వైద్య, కంటి వైద్య శిబిరాలను ఆయన ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాల్లో గ్రామీణ పేదలకు కంటి పరీక్షలతో పాటు, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ప్రచార ఆర్భాటానికి దూరంగా.. పనిలో చూపుతున్న చొరవ ఎలాంటి ప్రచార హంగామా లేకుండా, మీడియా ముందుకు రాకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోవడం ఏలూరి సాంబశివరావు నైజం. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలకు రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, సుమారు రూ.100 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని ఆయన చేపట్టారు. దశాబ్దాలుగా సరైన రహదారి సౌకర్యానికి నోచుకోని పేద, బలహీన వర్గాల కాలనీలు ఈ పథకంతో మంచి రోడ్లను సొంతం చేసుకున్నాయి. ప్రచారార్భాటానికి, పతాక శీర్షికలకు ఆశపడకుండా, నిశ్శబ్దంగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడమే తన విధానంగా ఆయన కొనసాగుతున్నారు. పిలిస్తే పలికే ప్రజా నేత సౌమ్యుడిగా, అన్యాయాలకు దూరంగా ఉండే శాసనసభ్యుడిగా పేరు తెచ్చుకున్న ఏలూరి సాంబశివరావు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, పార్టీపరంగానూ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిరంతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పర్చూరు ప్రజల మదిలో శాశ్వత స్థానం సంపాదించుకున్న సాంబన్నగా ఆయన ఇప్పటికీ కొనసాగుతున్నారు.
131 వీక్షణలు

ట్యాగ్‌లు

#yeluri #minister #cm #mla

సంబంధిత వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·