ప్రజా ప్రభుత్వ రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదల

సీఎం చంద్రబాబు

అమరావతి,జూన్‌ 21: ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన పురోగతిని ప్రజలకు తెలియజేసేందుకు ‘ప్రోగ్రెస్ రిపోర్ట్–2024-26’ పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై విడుదల చేసిన ఏడు శ్వేతపత్రాలకు అనుబంధంగా యాక్షన్ టేకెన్ రిపోర్టుల మాదిరిగా ఈ నివేదికలు ఉండాలని సూచించారు. మొత్తం 10 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులు సిద్ధం చేయాలని నిర్ణయించగా, వాటిలో ఫైనాన్స్, డెవలప్‌మెంట్, వెల్ఫేర్, గవర్నెన్స్ అంశాలకు సంబంధించిన నాలుగు నివేదికలను ముఖ్యమంత్రి స్వయంగా విడుదల చేయనున్నారు. మిగిలిన ఆరు నివేదికలను సంబంధిత శాఖల మంత్రులు విడుదల చేయనున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని ‘డెవలప్‌మెంట్’ నివేదికలో, సంక్షేమ పథకాలు, పీ–4 వంటి కార్యక్రమాలను ‘వెల్ఫేర్–ఎంపవర్‌మెంట్’ నివేదికలో పొందుపరచనున్నారు. ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలు, సంస్కరణలు ‘గుడ్ గవర్నెన్స్’ నివేదికలో చోటు చేసుకోనున్నాయి. జూలై 18 నాటికి అన్ని నివేదికలను విడుదల చేసి, అనంతరం వాటిని సమగ్ర పుస్తకంగా తీసుకురావాలని సీఎం సూచించారు. ప్రతి ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేసే విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. సోమవారం విద్యుత్ రంగానికి సంబంధించిన తొలి ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల కానుంది. ఈ మేరకు ఆదివారం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
124 వీక్షణలు

ట్యాగ్‌లు

#cm #cbn #andhra #pradesh #government #good #governance #2 #years #progress #report

సంబంధిత వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·