ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్ర: మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ బలంగా ఉన్న చోట 30-35 శాతం ఓట్లను ‘ఫేక్’ పేరిట తొలగించే యత్నం

ఖమ్మం,(ఏదులాపురం): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో 30 నుంచి 35 శాతం ఓట్లను ‘ఫేక్‌ ఓట్లు’గా చిత్రీకరించి జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) అవగాహన శిక్షణ శిబిరం శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట క్రాస్ రోడ్డులో గల పీవీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ఓటరు వయస్సు, పేర్లలో స్వల్ప పొరపాట్లను సాకుగా చూపి ఓట్లను తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే బీహార్‌, పశ్చిమ బెంగాల్‌లలో ఇటువంటి విధానాన్ని అమలు చేశారని, అదే తరహా ప్రయత్నాలు తెలంగాణలోనూ జరుగుతున్నాయని ఆరోపించారు. ‘ఎస్‌ఐఆర్‌’పై విమర్శలు ‘ఎస్‌ఐఆర్‌’ ఒక పెద్ద భూతంలాంటిదని, ఇది దొంగదారి చర్య అని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును కాపాడుకోవాలని సూచించారు. రాజ్యసభ ఎన్నికల ప్రస్తావన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను ప్రస్తావించిన మంత్రి, కావలసిన దానికంటే ఎక్కువ ఓట్లు ఉన్నప్పటికీ ఒత్తిడితో నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు దక్కాల్సిన ఒక రాజ్యసభ స్థానాన్ని దూరం చేశారని విమర్శించారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ వంటి సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని మంత్రి ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రజాప్రతినిధులను భయపెడుతున్నారని అన్నారు. ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఓటు మ్యాపింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ శ్రేణులు చురుకుగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ఉద్యోగాలు, విద్య కారణంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు గ్రామాలకు వచ్చి తమ పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయో లేదో పరిశీలించుకోవాలని కోరారు. దొంగ ఓట్లు అవసరం లేదని, ఉన్న ప్రతి ఓటును కాంక్రీట్ గోడలా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, పీసీసీ ప్రతినిధి సుధాకర్, ఏదులాపురం మున్సిపల్ చైర్మన్‌, వైస్ చైర్మన్‌, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, 291 బూత్‌ల బీఎల్‌ఏలు పాల్గొన్నారు.
242 వీక్షణలు

ట్యాగ్‌లు

#khammam #ministerponguleti #sir #ndavsindia

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

సాంబన్న కృషి

రచయిత Sriram ·
రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·