గిరిజన గ్రామాలకు రూ.110 కోట్లు ఇవ్వండి

కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ

ఖమ్మం, జూన్‌ 23:ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలంలో ఏజెన్సీ, గిరిజన గ్రామ పంచాయతీలకు వరద నీటి కాలువలు, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం కోసం రూ.110 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత-జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు లేఖ రాశారు. సోమవారం రాసిన ఈ లేఖలో మండలంలోని డ్రైనేజీ సమస్యలను మంత్రి వివరించారు. మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 28 ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పరిధిలోకి వస్తాయని మంత్రి తెలిపారు. వర్షాకాలంలో సరైన వరద నీటి కాలువలు లేక ఈ గ్రామాలు తీవ్ర నీటి నిల్వ, పారిశుధ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయని, గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా వరద నీటి కాలువలు, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ పనులకు రూ.110 కోట్లు అంచనా వ్యయం అవుతుందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన తన నియోజకవర్గ పరిధిలోని ఈ గిరిజన ప్రాంతాలకు సరిపడా స్థానిక వనరులు లేనందున, గ్రామీణాభివృద్ధి లేదా గిరిజన ప్రాంత అభివృద్ధి పథకాల ద్వారా నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని తుమ్మల కోరారు. ప్రతిపాదిత పనులు ఈ గిరిజన ప్రాంతాల్లో పారిశుధ్యం, ప్రజారోగ్యం, జీవన పరిస్థితులు, మొత్తం మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. డీపీఆర్‌తో పాటు గ్రామ పంచాయతీల జాబితాను లేఖకు జతచేస్తూ, నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించాలని కేంద్ర మంత్రిని ఆయన అభ్యర్థించారు.
126 వీక్షణలు

ట్యాగ్‌లు

#minister #tummala #central #government #shivraj #singh #chauhan

సంబంధిత వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·