*ఎమ్మెల్యే సాంబన్న అభయహస్తం*

ఒక్కరోజులోనే రూ.4 లక్షల సాయం

పర్చూరు: ఆ కుటుంబం కళ్లలో ఆందోళన... గుండెల్లో దిగులు. ఇంటిపెద్ద ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుంటే, ఏం చేయాలో పాలుపోని స్థితి. చికిత్సకు కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియని అయోమయం. ఇలాంటి కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచారు ఎమ్మెల్యే ఏలూరి. చిన్నగంజాం మండలం, చిన్నగంజాం గ్రామానికి చెందిన గంట నాగరాజు కొంతకాలంగా అధిక రక్తపోటు, మూత్రపిండ వ్యాధి, హైపర్ కలేమియాతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స చేయించాలని సూచించారు. ఇంటిపెద్ద ప్రాణం మీదకు వచ్చిందన్న భయం ఒకవైపు, శస్త్రచికిత్స ఖర్చు భరించలేని ఆర్థిక పరిస్థితి మరోవైపు కుటుంబాన్ని కుంగదీశాయి. ఏం చేయాలో తోచని స్థితిలో ఆ కుటుంబ సభ్యులు స్థానిక నాయకులతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ను ఆశ్రయించారు. బాధిత కుటుంబం పడుతున్న వేదనను అర్థం చేసుకున్న ఆయన, ఆలస్యం చేయకుండా తక్షణమే ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్ఓసీ ద్వారా రూ.4 లక్షల చెక్కు ఒక్కరోజులోనే మంజూరయ్యేలా చొరవ తీసుకున్నారు. డబ్బు లేక చికిత్స ఆగిపోతుందేమోనన్న భయంతో ఉన్న ఆ కుటుంబానికి, ఎమ్మెల్యే సాంబన్న చూపిన ఈ మానవత్వం కొండంత అండగా నిలిచింది. నిరుపేదల కష్టాల్లో వెంటనే స్పందించి, సకాలంలో సాయం అందించడంలో ఏలూరి చూపిస్తున్న చొరవను స్థానికులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.
213 వీక్షణలు

ట్యాగ్‌లు

#cmrf #mlayeluri

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

*ఉద్యాన హబ్‌లో పర్చూరుకు స్థానం*

సాంబన్న కృషి

రచయిత Sriram ·
రాజకీయాలు

*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*

అమ్మానాన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విఘ్నాలు తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ

ప్రత్యేక ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

బాహుబలి శైలిలో సీఎం రేవంత్‌ రెడ్డి..

భుజాన గణనాథుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ భూ సేకరణకు ప్రభుత్వం ఆమోదం

ఫలించిన ఎమ్మెల్యే ఏలూరి కృషి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

టీడీపీలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు

జడ్పీ ఛైర్మన్‌ మజ్జి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*కార్యకర్తే అధినేత..ఆర్థికంగా ఎదగాలి!*

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·